మంచు మనోజ్ సినిమాలు మానేసినట్లేనా


Manchu manoj says farming himself in village

మంచు మనోజ్ ఇక సినిమాలు మానేసినట్లేనా ? ఎందుకంటే హాయిగా మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని ట్వీట్ చేయడమే ఈ కామెంట్స్ రావడానికి కారణం . ఇంతకుముందు కూడా ఇక నటనకు గుడ్ బై చెబుతున్నానని ట్వీట్ చేసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసాడు మంచు మనోజ్ . అయితే తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ మాత్రం సరదా కోసమే ……. సుమా ! మంచు మనోజ్ ని అభిమానించే ఓ అభిమాని ” అన్నా ….. రాత్రి నా కల్లో కొచ్చావ్ ! నువ్ పసిపిల్లాడిలా బురద పొలంలో ఆడుకుంటున్నావ్ ” అని పోస్ట్ చేయగా దానికి సంతోషపడిన మంచు మనోజ్ ” మా ఊరెళ్ళి హాయిగా వ్యవసాయం చేసుకుంటానని ” పేర్కొన్నాడు .

చాలా వినసొంపుగా ఉందని , పొలంకు వెళ్లి చాలా సంవత్సరాలు అయ్యిందని ….. ఈసారి మా ఊరెళ్ళి స్వయంగా పొలం పండిస్తానని ట్వీట్ చేసాడు . హీరోగా పదేళ్లు పూర్తిచేసుకున్నాడు మంచు మనోజ్ కానీ సక్సెస్ పరంగా మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు . హీరోగా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు కానీ పాపం కాలం కలిసి రావడం లేదు మంచు మనోజ్ కు .

English Title: manchu manoj says farming himself in village