భార్య కు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్


Manchu Manoj wishes his love of life wife

భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమెపట్ల తనకున్న ప్రేమని వ్యక్తం చేసాడు హీరో మంచు మనోజ్ . ప్రణతి రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆమె పట్ల తనకున్న ప్రేమని తెలియజేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు మంచు మనోజ్ . ప్రణతి రెడ్డి మంచు మనోజ్ వదిన అయిన విరానికా రెడ్డి క్లాస్ మేట్ దాంతో ప్రణతి తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది , కట్ చేస్తే వాళ్ళ ప్రేమకు పెద్దలు ఆశీస్సులు అందజేయడంతో కథ సుఖాంతం అయ్యింది .

అయితే గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు పొడ చూపాయని ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడం సంచలనం సృష్టించింది దాంతో మంచు మనోజ్ స్పందించాడు , నేను నా భార్య హాయిగా ఉన్నాం మేము విడిపోవడం లేదు మా ఆమధ్య చిచ్చు పెట్టకండి అంటూ సోషల్ మీడియా ముందుకు వచ్చాడు . దాదాపు మూడేళ్ళ క్రితం ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్ . హీరోగా స్టార్ డం అందుకోవాలని పదేళ్లుగా సన్నాహాలు చేస్తున్నాడు కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు ఈ హీరో అయితే అందరితో కలివిడిగా ఉండే మంచు మనోజ్ అంటే ఇండస్ట్రీ లో మిగతా హీరోలకు కూడా మంచి అనుబంధం ఉంది .

English Title: Manchu Manoj wishes his love of life wife