`ఢీ`కి సీక్వెల్.. ఈ సారి డ‌బుల్ డోస్.. టైటిల్ ఇదే!`ఢీ`కి సీక్వెల్.. ఈ సారి డ‌బుల్ డోస్.. టైటిల్ ఇదే!
`ఢీ`కి సీక్వెల్.. ఈ సారి డ‌బుల్ డోస్.. టైటిల్ ఇదే!

మంచు విష్ణు, శ్రీ‌ను వైట్ల క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం `ఢీ`. 2007ల విడుద‌లైన ఈ మూవీ మంచు విష్ణు కెరీర్‌ని ఓ మ‌లుపు తిప్పింది. జెనీలియా హీరోయిన్‌గా .. శ్రీ‌హ‌రి, బ్ర‌హ్మానందం, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి మంచు విష్ణు కెరీర్‌లోనే మ‌ర్చిపోలేని ఎవ‌ర్‌గ్రీన్ హిట్‌గా నిలిచింది.

చాలా రోజులుగా ఈ మూవీకి సీక్వెల్ చేయ‌బోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనికి మ‌రింత బ‌లాన్ని చూకూరుస్తూ హీరో మంచు విష్ణు `కొన్ని వేల మంది అభిమానుల అభిమాన చిత్రం `ఢీ`. ఈ మూవీ కోసం ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి ఓ గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది. `ఢీ` కంటే బెట‌ర్ ఏమి వుంటుంది? అని మంచు విష్ణు రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

అంతా ఊహించిన‌ట్టుగానే మంచు విష్ణు సోమ‌వారం త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సూప‌ర్ హిట్ ఫిల్మ్ `ఢీ`కి సీక్వెల్‌ని చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి `డీ అండ్ డీ` అనే టైటిల్‌ని డ‌బుల్ డోస్ అంటూ క్యాప్ష‌న్‌ని ప్ర‌క‌టిస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశాడు. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు న‌టిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై నిర్మిచ‌బోతున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రానికి గోపీ మోహ‌న్, కిషోర్ గోపు రైట‌ర్స్‌గా ప‌నిచేయ‌న్నారు.