మంచు విష్ణు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశాడు!


 

Manchu vishnu announced Mosagallu release date
Manchu vishnu announced Mosagallu release date

మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `మోస‌గాళ్లు`.  ఇండో – హాలీవుడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. .తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని క‌రోనా వైర‌స్ కారణంగా అర్థాంత‌రంగా ఆపేశారు. దీంతో ఈ సినిమా పూర్తి చేయాల‌నుకున్న స‌మ‌యంకు పూర్త‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.

తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 5న విడుద‌ల చేస్తున్న‌ట్టు హీరో మంచు విష్ణు సోమ‌వారం మీడియాకు ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రం కోసం కీల‌క షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లోని కూక‌ట్ ప‌ల్లిలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. అక్క‌డే 3.5 కోట్ల‌తో భారీ ఐటీ సెట్‌ని ఏర్పాటు చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ప్ర‌పంచంలోనూ అత్యంత భారీ ఐటీ స్కామ్ గా పేర్కొన్న ఓ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ చిత్రంలో మంచు విష్ణుకి సిస్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది.