నలుగురు పిల్లల తండ్రి అయిన మంచు విష్ణుManchu Vishnu and Viranica Reddy blessed with a baby girl
Manchu Vishnu and Viranica Reddy blessed with a baby girl

నలుగురు పిల్లల తండ్రి అయిన మంచు విష్ణు

హీరో మంచు విష్ణు నలుగురు పిలల్లకు తండ్రి అయ్యాడు . ఈరోజు మంచు విష్ణు భార్య విరానికా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది . శ్రావణ శుక్రవారం రోజున ఆడపిల్ల పుట్టడంతో మంచు కుటుంబం చాలా సంతోషంగా ఉంది . ఆ అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబానికి లభించాయని అందుకే ఈరోజే అమ్మాయి పుట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

మంచు విష్ణు – విరానికా లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . మొదట ఈ ఇద్దరికీ కవల పిల్లలు పుట్టగా వివియానా , అరియనా అనే పేర్లు పెట్టారు . ఆ తర్వాత అవ్రామ్ అనే అబ్బాయి పుట్టాడు , ఇక ఇప్పుడేమో మరో అమ్మాయి దాంతో మొత్తం మంచు విష్ణు నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు !