మ‌హేష్‌ని కామెంట్ చేసిన మంచు విష్ణు!


మ‌హేష్‌ని కామెంట్ చేసిన మంచు విష్ణు!
మ‌హేష్‌ని కామెంట్ చేసిన మంచు విష్ణు!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌పై హీరో మంచు విష్ణు కామెంట్ చేశారు. రోజు రోజుకీ త‌ను యంగ్‌గా మారిపోతున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ప్రిన్స్ మ‌హేష్ లాక్‌డౌన్ ద‌గ్గ‌రి నుంచి మ‌రింత హ్యాండ్స‌మ్‌గా మారిపోయిన విష‌యం తెలిసిందే. దాదాపు ప‌ది నెల‌లుగా ఇంటి ప‌ట్టునే వుంటూ పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్న మ‌హేష్ మ‌రింత అందంగా మారిన విష‌యం తెలిసిందే.

హీరో మంచు విష్ణు కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించి స‌ర్ప్రైజ్ చేశారు.  శుక్ర‌వారం రాత్రి హీరో మంచు విష్ణు ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ ఫ్రెండ్స్‌కి ప్ర‌త్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చాలా మంది మంచు విష్ణు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో స‌హా హాజ‌రై సంద‌డి చేశారు. ఇదే పార్టీలో హీరో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త పాల్గొన్నారు. ఈ ఇద్ద‌రు హీరోల ఫ్యామిలీస్ పార్టీని ఎంజాయ్ చేశారు.

అనంత‌రం హీరో మంచు విష్ణు, విరోనిక‌, న‌మ్ర‌త‌, మ‌హేష్ ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన మంచు విష్ణు.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ అందంపై కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం మంచు విష్ణు షేర్ చేసిన ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. మ‌హేష్ ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తున్నారు. మంచు విష్ణు `మోస‌గాళ్లు`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.