చరణ్ కు అన్యాయం జరిగిందంటున్న మంచు విష్ణు


Ram Charan and Manchu Vishnu
Ram Charan and Manchu Vishnu

రంగస్థలం చిత్రంలో నటించినందుకు రాంచరణ్ కు తప్పకుండా జాతీయ అవార్డు లభించాల్సి ఉంది , చరణ్ అందుకు అర్హుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో మంచు విష్ణు. ఇటీవలే 66 వ జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ అవార్డులలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి అయితే వాటిని అభినందిస్తూనే నా సోదరుడు చరణ్ కు అన్యాయం జరిగిందని అంటున్నాడు మంచు విష్ణు.

ఇదే అభిప్రాయాన్ని మెగా అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు అభిప్రాయం తో ఏకీభవిస్తూ చరణ్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించాల్సి ఉండే అని అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ నటనకు జేజేలు పలికారు ప్రేక్షకులు. ఇక చరణ్ పై ప్రశంసల వర్షం కురిసింది కానీ అవార్డు మాత్రం లభించలేదు. దాంతో తెలుగు సినిమారంగంలో ఇదొక చర్చ అయ్యింది . చరణ్ సంగతి పక్కన పెడితే ఈ ఏడాది అవార్డులలో తెలుగు సినిమాలు మాత్రం సత్తా చాటాయి.