`మోస‌గాళ్లు` హాలీవుడ్‌లో రిలీజ్ అయ్యేనా?

`మోస‌గాళ్లు` హాలీవుడ్‌లో రిలీజ్ అయ్యేనా?
`మోస‌గాళ్లు` హాలీవుడ్‌లో రిలీజ్ అయ్యేనా?

ఎంత ప్యాష‌న్ వున్నా దాన్ని క‌రెక్ట్‌గా పోట్రేట్ చేయ‌గ‌ల వాళ్లు లేక‌పోతే అది ఏమాత్రం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేదు. భారీ స్థాయిలో ఖ‌ర్చు చేసి తీసినా ఫ‌లితం ఇవ్వ‌దు. మంచు విష్ణు చేసిన ప్ర‌య‌త్నం కూడా అలాగే నీరుగారిపోయింది. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేని మంచు విష్ణు తొలి సారి త‌న మార్కెట్ స్థాయికి రెండింత‌లు పైనే ఖ‌ర్చు పెట్టి చేసిన సాహ‌సం `మోస‌గాళ్లు`.

అమెరికాలో జ‌రిగిన భారీ ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో క‌లిసి చేసి ఈ సినిమా గ‌త వారం విడుద‌లైంది. ప్ర‌చారం అంతంత మాత్రంగానే చేశారు. అమెరిక‌న్ ద‌ర్శ‌కుడు జెఫ్రీ గీచిన్ డైరెక్ట్ చేశాడు. అంతా బాగానే వుంది కానీ ఈ సినిమాని చూసేందుకు జ‌నాలు లేరు. కార‌ణం ప‌బ్లిసిటీతో పాటు ఆక‌ట్టుకోలేని క‌థ‌నం.. దీంతో ఈ సినిమా ఇక్క‌డ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

హాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని నిర్మించామ‌ని, కొంత వెర్ష‌న్ చిత్రీక‌ర‌ణ వుంద‌ని, తెలుగుని మించి హాలీవుడ్ వెర్ష‌న్ వుంద‌ని మంచు విష్ణు ఇటీవ‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వెల్ల‌డించారు. కానీ తెలుగులోనే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేని ఈ మూవీని హాలీవుడ్‌లో చూస్తారా? అన్న‌ది ఇప్పుడున్న ప్ర‌శ్న‌. ఇంత‌కీ అక్క‌డ రిలీజ్ అయ్యేనా అని అనుమానం వ్య‌క్తం చేస్తున్న వాళ్లు కూడా వున్నారు. ఈ నేప‌థ్యంలో `మోస‌గాళ్లు` ఇంగ్లీష్ వెర్ష‌న్ విడుద‌ల‌వుతుందా లేదా అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.