మంచు విష్ణు స‌రికొత్త మేకోవ‌ర్‌!


మంచు విష్ణు స‌రికొత్త మేకోవ‌ర్‌!
మంచు విష్ణు స‌రికొత్త మేకోవ‌ర్‌!

హీరో మంచు విష్ణు కొంత విరామం త‌రువాత `మోస‌గాళ్లు` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అమెరికాలో జ‌రిగిన ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ‌హు భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని మ‌హా శివరాత్రి కానుక‌గా మార్చి 11 న విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ త‌రువాత శ్రీ‌ను వైట్ల‌తో క‌లిసి మంచు విష్ణు ఢీ అండ్ ఢీ` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. సూప‌ర్ హిట్ మూవీ `ఢీ` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇదిలా వుంటే స‌రికొత్త మేకోవ‌ర్ కోసం మంచు విష్ణు గ‌త కొన్ని రోజులుగా వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని తాజాగా మంచు విష్ణు సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. బారు గ‌డ్డంతో మంచు విష్ణు యాలా ఫిట్‌గా క‌నిపిస్తున్నారు. శ్రీను వైట్లతో కలిసి కామెడీ ప్ర‌ధానంగా `ఢీ అండ్ ఢీ` మూవీని త్వ‌ర‌లో మంచు విష్ణు ప‌ట్టాలెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోస‌మే విష్ణు స‌రికొత్త మేకోవ‌ర్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.