డిజిట‌ల్ రంగంలోకి మంచు విష్ణు!డిజిట‌ల్ రంగంలోకి మంచు విష్ణు!
డిజిట‌ల్ రంగంలోకి మంచు విష్ణు!

డిజిట‌ల్ మేనియా ప్ర‌పంచాన్ని దాసోహం చేసుకుంటోంది. హాలీవుడ్‌లో ఇప్ప‌టికే సినిమాల కంటే ఎక్కువ‌గా డిజిట‌ల్ కంటెంట్‌కే అధిర ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి బాగానే పెరిగిపోయింది. టాలీవుడ్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. వెబ్ సిరీస్‌లు చాలానే వ‌స్తున్నాయి. టాప్ స్టార్‌లు కూడా వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇప్ప‌టికే కొణిదెల నిహారిక‌ మంచు ల‌క్ష్మి, జ‌గ‌ప‌తిబాబు, న‌వ‌దీప్‌ లాంటి వాళ్లు వెబ్ సిరీస్‌ల‌లో న‌టించారు.

స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రంగంలోకి మంచు విష్ణు ఎంట‌ర‌వుతున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీని మంచు విష్ణు గ‌తంలో ప్రారంభించారు. ఇప్పుడు అదే బ్యాన‌ర్‌పై వ‌రుస వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించ‌బోతున్నార‌ట‌. `చ‌ద‌రంగం` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

రాజ్ అనే యువ‌కుడు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో శ్రీ‌కాంత్‌, సునైనా, నాగినీడు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏపీలో గ‌త కొన్నేళ్ల క్రితం జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ఈ వెబ్ సిరీస్‌ని డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ జీ 5 లో ఫిబ్ర‌వ‌రి 20 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్‌ల‌తో దీన్ని రూపొందించారు.