జి . నాగేశ్వర్ రెడ్డి చిత్రాలు అంటే వినోదానికి పెద్ద పీట వేస్తాయని అందరికీ తెలిసిందే . ఒకటి రెండు మినహా నాగ్వశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి . మంచు విష్ణు – బ్రహ్మానందం – జి . నాగేశ్వర్ రెడ్డి ల కాంబినేషన్ లో వచ్చిన ” దేనికైనా రెడీ ” చిత్రం పెద్ద హిట్ అయ్యింది దాంతో పాటు ” ఈడోరకం ఆడోరకం ” చిత్రం కూడా హిట్ అయ్యింది దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు మంచు విష్ణు కానీ డిజాస్టర్ టాక్ తో షాక్ అయ్యారు ఆ చిత్ర బృందం . ఆచారి అమెరికా యాత్ర లో వినోదానికి ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కానీ డైలాగ్స్ అంతగా కుదరకపోవడంతో సినిమా తేలిపోయింది . ఇక మంచు విష్ణు పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది . హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందాలను ఆరబోసి కుర్రాళ్ళ ని కట్టిపడేసింది కానీ ఆమె అందాలు రెండున్నర గంటల పాటు థియేటర్ లో కూర్చునేలా లేకపోవడంతో ప్లాప్ జాబితాలో చేరిపోయింది ఆచారి అమెరికా యాత్ర .