హీరోని క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి!


హీరోని క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి!
హీరోని క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి ఓ టాలీవుడ్ హీరోని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ దేశాల‌న్నీ స్వియ నిర్భంధంలోకి వెళ్లిపోయాయి. ముందున్న ఉప‌ద్ర‌వం నుంచి త‌ప్పించుకోవాలంటే ప్ర‌పంచ దేశాల ముందున్న ఏకైక మార్గం లాక్ డౌన్‌. ఈ అస్త్రాన్ని భార‌త్‌తో స‌హా అన్ని దేశాలు పాటిస్తున్నాయి. దీంతో ఏ దేశం వారు ఆ దేశంలోనే వుండిపోవాల్సిన ప‌రిస్థితి. అంత‌ర్జాతీయ స‌ర్వీసుల్ని కూడా బంద్ చేయ‌డంతో అక్క‌డే ఆగిపోయిన వారంతా హాహా కారాలు చేస్తున్నారు.

టాలీవుడ్ హీరోని ఈ విష‌యంలో క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు మంచు విష్ణు. ఆయ‌న భార్య‌, పిల్ల‌లు లాక్ డౌన్‌, అంత‌ర్జాతీయ స‌ర్వీసుల నిలిపివేత కార‌ణంగా అమెరికాలో లాక్ అయిపోయారు. నిత్యం వాళ్ల‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న‌ప్ప‌టికీ  క‌ళ్ల ముందు లేరే అనే ఆవేద‌న చెందుతున్నార‌ట‌. త‌న‌లాగే ఎంతో మంది క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నార‌ని మంచు విష్ణు భావోద్వేగానికి గుర‌వుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో మంచు విష్ణు ఓ వీడియోను పోస్ట్ చేశారు. లాక్ డౌన్‌ను ప్ర‌తీ ఒక్క‌రూ పాటించాల‌ని, ఇళ్ల‌కే ప‌రిమితం కావాలని జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం వున్న ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ ఎన్నోరోజే కూడా మ‌రిచిపోయాను. గ‌డ్డం ఎందుకు పెంచుతున్నార‌ని చాలా మంది అడుగుతున్నారు. త‌న భార్యా పిల్ల‌లు క‌లిసిన‌ప్పుడు దీన్ని తీసేద్దామ‌ని అనుకున్నాన‌ని, వాళ్లంతా అమెరికాలో చిక్కుకు పోవ‌డంతో ఏం చేయాలో త‌న‌కు తోచ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 14 ప‌రిస్థితులు మారి విమాన స‌ర్వీసుల‌కు అనుమ‌తి ఇస్తార‌ని ఆశిస్తున్నాన‌ని మంచు విష్ణు భావోద్వేగానికి గురికావ‌డం ప‌లువురిని క‌దిలిస్తోంది.

 

View this post on Instagram

 

#StayHome #StaySafe

A post shared by Vishnu Manchu (@vishnumanchu) on

Credit: Instagram