మణికర్ణిక 3 రోజుల కలెక్షన్లు


 Manikarnika 3 days collections

కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం మూడు రోజుల్లో 42 కోట్ల వసూళ్ల ని రాబట్టింది . ప్రపంచ వ్యాప్తంగా 3000 స్క్రీన్ లలో జనవరి 25 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది . అయితే రెండో రోజు నుండి వసూళ్లు పుంజుకొని 42 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతోంది . అయితే విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ కావడం లేదు కానీ మంచి వసూళ్లు అయితే సాధిస్తోంది మణికర్ణిక .

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గా కంగనా నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . ఈ సినిమాకు  125 కోట్ల బడ్జెట్ అయ్యింది . వసూళ్లు బాగానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా 125 కోట్ల వసూళ్లు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు . వీటికి అదనంగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి తప్పకుండ లాభాలు వస్తాయని ఆ శిస్తున్నారు .

 

English Title: Manikarnika 3 days collections