అచ్చం వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ లా ఉంది


manikarnika the queen of jhansi first look releasedవీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” మణికర్ణిక ” ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ . ఝాన్సీ గా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ నటించిన విషయం తెలిసిందే . టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు . స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మణికర్ణిక లుక్ ని విడుదల చేసారు . ఝాన్సీ పాత్రలో అపరకాళికలా ఉన్న కంగనా రనౌత్ లుక్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది . ఝాన్సీ పాత్రలో కంగనా ఎలా ఉంటుందో అన్న అనుమానం ఈ లుక్ తో పటాపంచలు అయ్యింది . అచ్చం వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ లా ఉంది కంగనా .

క్రిష్ దర్శకత్వంలో గత ఏడాది ప్రారంభమైన ఈ మణికర్ణిక ని ఈ ఈవేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్ వర్క్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో సినిమా విడుదల వాయిదాపడింది , కొంతభాగం రీ షూట్ కూడా చేసారు . మరికొంత భాగం రీ షూట్ చేయనున్నారు కూడా . ఇక ఈ సినిమాని 2019 జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: manikarnika the queen of jhansi first look released