పెద్ద జుట్టు పెంచుతాం, సినిమాని పెద్దగా చేస్తాం.


Maniratnam
పెద్ద జుట్టు పెంచుతాం, సినిమాని పెద్దగా చేస్తాం.

పాన్ ఇండియా మూవీ అనేది పాత సినిమాలనుండి నడుస్తున్న హవా. వాటిని ఏ బాషలలో అయినా తీయొచ్చు, చూడొచ్చు. కానీ విజయం గురించి ఆలోచించాలి, బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలి. ఒక్కోసారి ఫార్ములా బెడిసి కొట్టొచ్చు, మంచి కథ ఉంటే “బాహుబలి” అవ్వొచ్చు. హిట్, ఫట్ అనేది ముందే ఆలోచించాలి లేకపోతే అంతే గా!

మొతానికి ఏ పరిశ్రమ అయిన పాన్ అనగానే బాహుబలి పేరు ముందు రావటం మనకి గర్వించదగ్గ విషయం. అల అని అన్ని పరిశ్రమ వాళ్ళు ప్రతి కథని బాహుబలి అనుకోని తీయడం తప్పు, ఉదాహరణకి కన్నడ “కురుక్షేత్రం”, “పహిల్వాన్” సినిమాలు. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. బాలీవుడ్ లో అయితే కుప్పలుగా ప్రయత్నిస్తున్నారు అక్కడ పరిస్థితే వేరు. ఇప్పుడు తమిళ నుండి ఇంకొక పాన్ ఇండియా సినిమా ఒకటి బయటికి వస్తుంది.

మణిరత్నం గత సంవత్సరం “నవాబ్” ని తెలుగు లో వదిలాడు, బాగానే ఆడింది. ఇప్పుడు మరొక ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా మూవీ గా మారుద్దాం అని కథ సిద్ధం చేసాడు, “పొన్నియిన్ సెల్వం” అని పేరు కూడా ఫిక్స్ చేసారు.

తారాగణం చియాన్ విక్రమ్, కార్తీ, విజయ్ సేతుపతి, జయంరవి,పార్తీబన్, ఐశ్వర్య రాయి బచ్చన్ ,కీర్తి సురేష్; చూసుకుంటే బాగానే ప్లాన్ చేస్తున్నారు అనేలా ఒకింత బజ్ వదిలారు. ఇప్పుడు తమిళంలో ఎక్కడ చూసిన ఈసినిమా గురించే మాట్లాడుకుంటున్నాను.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా పీరియాడిక్ మూవీ. అలా పీరియాడిక్ కావడంతో మన హీరో పాత్రలకు పొడవాటి జులపాలు అవసరం కదా, మణిరత్నం ఆదేశాల మేరకు వారు ఈపనిలో ఉన్నారని వినికిడి. ఐతే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

మణిరత్నం కారు ఒక పక్క చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు అని వినికిడి. మరి చూద్దాం మణిరత్నం గారి ఆలోచనలు, పనులు సినిమాని నెలపెడతాయో?