మ‌ణిర‌త్నం `న‌వ‌ర‌స‌` డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో సంచ‌ల‌నం!


మ‌ణిర‌త్నం `న‌వ‌ర‌స‌` డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో సంచ‌ల‌నం!
మ‌ణిర‌త్నం `న‌వ‌ర‌స‌` డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో సంచ‌ల‌నం!

ప్ర‌ఖ్యాత చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కొత్త‌గా వెబ్ సిరీస్‌ల బాట ప‌ట్టారు. అయితే ఈ ద‌ఫా ఆయ‌న డైరెక్ట్ చేయ‌డం లేదు కానీ మ‌రో ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర‌తో క‌లిసి `న‌వ‌ర‌స‌` పేరుతో ఓ మెగా వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి మొత్తం తొమ్మిది మంది ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌బోతున్నారు. తొమ్మిది భాగాలుగా ఇది రూపొందుతోంది.

డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో ఇదొక సంచ‌ల‌నంగా మార‌బోతోంది. ఉత్త‌రాదిలో ఇప్ప‌టికే వెబ్ సిరీస్‌ల నిర్మాణం జోరందుకున్నా ద‌క్షిణాదిలో ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. అయితే ఈ త‌రహాలో మెగా వెబ్ సిరీస్ రూపొంద‌డం ఇదే ప్ర‌ద‌మం కాబోతోంది. తొమ్మిది ఎపిసోడ్‌ల‌కు కేవీ ఆనంద్‌, గౌత‌మ్ మీన‌న్‌, బిజో నంబియార్‌, కార్తిక్ సుబ్బ‌రాజ్‌, పొన్ రామ్‌, హ‌లిత ష‌లీమ్‌, కార్తీక్ న‌రేన్‌, ర‌తీంద్ర‌న్‌, అర‌వింద‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

తొ‌మ్మిది క‌థ‌ల్లో రేవ‌తి, హీరో సూర్య, హీరో విజ‌య్ సేతుప‌తి, హీరో సిద్ధార్థ‌, అర‌వింద‌స్వామి, నిత్యామీన‌న్‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, రిత్విక‌, పూర్ణ‌, ప్ర‌కాష్‌రాజ్‌, బాబి సింహా, రిత్విక త‌దిత‌రులు న‌టించ‌నున్నారు. ఏ.ఆర్‌. రెహ‌మాన్‌, గోవింద్ వ‌సంత‌న్‌, జిబ్రాన్ వంటి హేమా హేమీలు ఈ త‌మిళ‌ వెబ్ సిరీస్‌కి సంగీతం అందిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.