స్టార్ హీరోల‌పై మ‌ణిర‌త్నం సంచ‌ల‌నం!


స్టార్ హీరోల‌పై మ‌ణిర‌త్నం సంచ‌ల‌నం!

స్టార్ హీరోల‌పై మ‌ణిర‌త్నం సంచ‌ల‌నం! 

సినీ ఇండ‌స్ట్రీల‌పై క‌రోనా కల్లోలం సృష్టిస్తోంది. షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ త‌రువాత సినిమా ప‌రిస్థితి మ‌రింత‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా కుంటుప‌డింది. ఇప్ప‌టికే భారీ చిత్రాల‌కు ఆడ్వాన్స్‌లు ఇచ్చిన వారంతా  ఎప్పుడు థియేట‌ర్లు తెలుస్తారా? ల‌క్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా?  షూటింగ్‌లు ఎప్పుడు మొద‌ల‌వుతాయా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ ప‌రిస్థితి మారాలంటే స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల‌ని ద‌గ్ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సిక్కి వెబ్‌నార్ సిరీస్‌లో సినిమాలు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగం భ‌విష్య‌త్తు అనే అంశంపై ప్ర‌సంగిస్తూ తాజా వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. చిత్ర ప‌రిశ్ర‌మ అవ‌స‌ర‌మైన మార్పుల‌తో ముందుకు సాగ‌డానికి సిద్ధంగా వుంది. అయితే త‌క్ష‌ణం థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి లేదన్న‌ది వాస్త‌వం. దీనికి సంబంధించిన మార్కెట్ క్షీణించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నా సినిమా బడ్జెట్‌ని త‌గ్గించుకోవాలి అన్నారు.

ముఖ్యంగా ఈ రంగం మ‌నుగ‌డ సాగించాలంటే ఈ రంగంలో ఉన్న వాళ్లు, ముఖ్యంగా స్టార్‌లు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు త‌గ్గించుకోవాలి. ఖ‌ర్చును త‌గ్గించుకోవాలి. చిత్ర ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ‌కు త‌మ వంత స‌హకారాన్ని అందించాలి` అన‌రి ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.