మహేష్ సినిమాకు సంగీత దర్శకుల కన్ఫ్యూజన్


మహేష్ సినిమాకు సంగీత దర్శకుల కన్ఫ్యూజన్
మహేష్ సినిమాకు సంగీత దర్శకుల కన్ఫ్యూజన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఈ హీరో రీసెంట్ గా హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టేసాడు. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ ఇప్పటికే తన తర్వాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. ఇద్దరూ కలిసి రీసెంట్ గా మహర్షి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తుంటే ఆటోమాటిగ్గా అంచనాలు పెరిగిపోతాయి కదా. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఏప్రిల్ లో ముహూర్తం జరుపుకోనున్న ఈ చిత్రం మే నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుంది. వంశీ పైడిపల్లి ప్రస్తుతం నటులను, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే సంగీత దర్శకుడిగా థమన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. థమన్ ఫైనల్ అయిపోయాడు అని కూడా అన్నారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఫామ్ లో లేని దేవి శ్రీ ప్రసాద్ కు ప్రత్యామ్నాయం అయితే వెతుకుతున్నారట. అనిరుధ్ లేదా మణిశర్మలలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. దాని తర్వాత అవకాశాలు కూడా బానే పెరిగాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అలాగే మహేష్ కు గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు మణిశర్మ. అందుకని వంశీ పైడిపల్లి సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. మరోవైపు అనిరుధ్ ను పెట్టుకోవాలని, మహేష్ భార్య నమ్రత సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారు అన్నది త్వరలోనే తేలుతుంది.