ఎక్స్ పెక్కుటేషన్స్ ని పెంచేస్తున్న “మన్మధుడు-2” !!


manmadhudu 2 increasing expectations
manmadhudu 2

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్  కాంబినేషన్లో ‘చి..ల.. సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`.  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్  కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.  కాగా ఈ చిత్రం రిలేజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసారు.. లక్ష్మి, జాన్సీ, వెన్నలకిషోర్, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. సమంత అతిధి పాత్రలో తళుక్కున మెరవనున్నారు.

మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జునఅక్కినేని,పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున మన్మధుడు చిత్రంలో ఎంత అందంగా కనిపించారో అంతకంటే రెండింతలు అందంగా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. మన్మధుడు-2 చిత్రంలోని నాగ్ స్టిల్స్ కి అభిమానులనుండే కాక లేడీ ఫాన్స్ నుండి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రాన్ని  ఆగ‌స్ట్ 9న  ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు!!