`ఆదిపురుష్‌` లంకేష్ పాత్ర సీక్రెట్ చెప్పేశాడు!

`ఆదిపురుష్‌` లంకేష్ పాత్ర సీక్రెట్ చెప్పేశాడు!
`ఆదిపురుష్‌` లంకేష్ పాత్ర సీక్రెట్ చెప్పేశాడు!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌ని ప్ర‌క‌టించి మిగతా స్టార్‌ల‌కు షాకిచ్చిన విష‌యం తెలిసిందే. `రాధేశ్యామ్‌` త‌రువాత వెంట‌నే బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో  మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌`ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టి సిరీస్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త్రీడీ ఫార్మాట్‌లో రూపొంద‌నున్న ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు.

రామాయ‌ణ ఇతిహాసం నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ మూవీలో రావ‌ణ బ్ర‌హ్మ లంకేష్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. `తానాజీ`లో అతి క్రూరుడైన ఉద‌య‌భాన్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న సైఫ్‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ లంకేష్ పాత్ర కోసం ఎంచుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇటీవ‌ల త‌న పాత్ర గురించి వెల్ల‌డించి విమ‌ర్శ‌ల‌కు సైఫ్ గురైన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో సైఫ్ పాత్ర గురించి రైట‌ర్‌, గేయ ర‌చ‌యిత మ‌నోజ్ ముంతాషీర్ వెల్ల‌డించారు.

ఈ పాత్ర తీరు తెన్నుల గురించి ప‌లు సీక్రెట్‌ల‌ని బ‌య‌ట‌పెట్టారు. సినిమాలో రావ‌ణ్ పాత్ర ఆడంబ‌రంగా వుంటుంది. అత్యంత క్రూరంగా, సాడిస్టిక్‌గా వుంటుంది. వీఎఫ్ ఎక్స్ ద్వారా సైఫ్ పాత్ర ఎత్తుని 8 నుంచి 9 అడుగుల పొడ‌వుగా చూపించ‌బోతున్నాం. గుబురు మీసం.. పొడ‌వాటి జుట్టుతో ఆహార్యం గంభీరంగా వుంటుంది. ప్ర‌తీ పాత్ర ఓ ఛాలెంజ్ గా వుంటుంది. కానీ ఇలాంటి పాత్ర పోషించ‌డం ఓ బాధ్య‌త‌. ఈ ఇతిహాసంలో ఇలాంటి పాత్ర‌ని చేయ‌డానికి చాలా ఎక్సైటెడ్‌గా వున్నాన‌ని` ప్ర‌భాస్ చెప్పిన‌ట్టు తెలిసింది.