రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`


రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`
రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`

`రొమాంటిక్ క్రైమ్ క‌థ‌` ఫేమ్ మ‌నోజ్ నందం హీరోగా న‌టిస్తున్న చిత్రం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌ `బ్లాక్డ్‌`. శ్వేత సాలూరు హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ బ్యాన‌ర్‌పై రామ్ లొడ‌గల‌ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  రామారావు లెంక‌, ప‌‌ద్మ లెంక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర బృందం ఇటీవ‌లే విడుద‌ల చేసింది.

స‌రికొత్త నేప‌థ్యంలో ఆద్యంతం ఆసక్తిక‌రంగా సాగే థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఈ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే హార‌ర్ కామోడీ జోన‌ర్‌లో అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునే విధింగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని, కొత్త త‌ర‌హా చిత్రాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని నిర్మాత‌లు ప‌ద్మ లెంక‌, రామారావు లెంక చెబుతున్నారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. న‌టీనటులు కొత్త వారైనా అద్భుతంగా న‌టించార‌ని. సినిమా అనుకున్న దానికి మించి అద్భుతంగా వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, పాట‌ల్ని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు.  శేకింగ్ శేషు, ఎఫ్ెమ్ బాబాయ్‌, టీఎన్నార్‌, స‌త్య‌శ్రీ‌, మెహ‌బూబ్ బాషా, విన‌య్ మ‌హాదేవ‌న్, రామారావు లెంక త‌దిత‌రులు న‌టిస్తున్నారు.