ప్రేమ & పగ కాంబినేషన్ లో మరొక సినిమా “మర్ జావాన్”


ప్రేమ & పగ కాంబినేషన్ లో మరొక సినిమా “మర్ జావాన్”
ప్రేమ & పగ కాంబినేషన్ లో మరొక సినిమా “మర్ జావాన్”

ఈ శుక్రవారం రిలీజ్ అయిన హిందీ సినిమా “మర్ జావాన్”. కొన్ని సినిమాలలో హీరో & హీరోయిన్ కాంబినేషన్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లే , కొన్ని సినిమాలో హీరో & విలన్ కాంబినేషన్ లు కూడా ఆడియెన్స్ కి గుర్తుండిపోతాయి. వాటిలో ఒకరి 5 ఏళ్ళ క్రితం రితేష్ దేశ్ ముఖ్ & సిద్దార్థ్ మల్హోత్రా ల కాంబినేషన్ లో మోహిత్ సూరి డైరెక్షన్ లో వచ్చిన ఎక్ విలన్ సినిమా. ఆ సినిమాలో సైకో విలన్ గా రితేష్ దేశ్ ముఖ్ నటన జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే జోడీతో గత ఏడాది జాన్ అబ్రహం తో “సత్యమేవ జయతే” లాంటి హిట్ సినిమా తీసిన, దర్శకుడు మిలన్ మిలాప్ జవేరి తీసిన సినిమా “మర్ జావాన్”. ఈ శుక్రవారం విడుదల అయింది . ఒక్కసారి ఆ సినిమా విశేషాలు గమనిస్తే, రఘు, (సిద్దార్థ్ మల్హోత్రా) ఒక మాస్ కుర్రాడు. జొయా (తారా సుతరియా) అనే అమ్మాయి ఇద్దరూ లవర్స్. అయితే అనుకోకుండా, వీళ్ళ జీవితాల లోకి విష్ణు (రితేష్ దేశ్ ముఖ్) అనే ఒక 3 అడుగుల మరుగుజ్జు విలన్ ఎంట్రీ ఇస్తాడు. డైరెక్టర్ సినిమాలో చూపించిన ఐడియా ప్రకారం,

“10 తలలు ఉన్న రావణుడికి, 10 అవతారాలు ధరించే విష్ణు మూర్తి కి జరిగిన యుద్దంలో ఎవరు గెలిచారు.? హీరో తను ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోనే ఎందుకు చంపుకోవలసి వచ్చింది.? అందరూ ఎందుకు ఆ ౩ అడుగుల మరుగుజ్జు విలన్ కి అంతగా భయపడతారు.? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు దొరకాలి అంటే, ఈ సినిమా చూడాల్సిందే. మన తెలుగులో సెటిల్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో మరొక హీరోయిన్ అయితే, కరణ్ జోహార్ రీసెంట్ అట్టర్ ఫ్లాప్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తారా సుతరియా నటన ఈ సినిమాలో సూపర్ గా ఉంటుంది. కొసమెరుపు ఏంటంటే మన అజిత్ వీరం సినిమాలో హీరో ఎలివేషన్ కి వాడిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సడెన్ గా ఈ సినిమాలో కూడా వినపడతుంది కాబట్ట్టి ఆట్టే కంగారు పడద్దు.