గుత్తా జ్వాల రెండో పెళ్లి చేసుకోబోతోందా ?


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హాట్ భామ గుత్తా జ్వాల తమిళ నటుడు విష్ణు విశాల్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి . బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది గుత్తా జ్వాల అయితే కాపురం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2011 లో విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత గుత్తా జ్వాల పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి .

కట్ చేస్తే ఇప్పుడు విష్ణు విశాల్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది . పైగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మీ అంతకంటే ఒకరి పై మరొకరికి మరింత గౌరవం కూడా ఉంది అని చెబుతున్నాడు . దాంతో ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి . బ్యాట్ పట్టి గ్రీజ్ లో హడలెత్తించే కంటే గ్లామర్ తో చంపేసే ఈ భామ మళ్ళీ పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి అన్నమాట .