మార్షల్ – సినిమాయే ప్రయోగం ఫలితం భగవంతుడికి


marshal movie story line
మార్షల్ – సినిమాయే ప్రయోగం ఫలితం భగవంతుడికి

సినిమా తీసే ముందు కథని సినిమా లాగా చూపిస్తున్నమా,లేదా లాజిక్ ని వొదిలేసి మేజిక్ గా చూపిస్తే జనాలు చూస్తారు లే, మనం తియోచ్చు, నిర్మాత మనకి అండగా ఉన్నాడు మనకి మన కథ కి ఎటువంటి ఆపద లేదు అని అనుకుంటే ఆ నిర్మాత గురించి తలుచుకుంటేనే బాధ మరియు ఒక రకమైన భావన కలుగుతుంది.ఇంతకి మరి ఆ నిర్మాతే హీరో అయివుంటే, దర్శకుడు ఇంకా మధన పడాల్సిన అవసరం ఉండదు.పని సులువుగా అవుతుంది.కాని మనకి పని కాదు సినిమా కూడా బాగా ఆడాలి మంచి పేరు తెచ్చుకోవాలి.మరి ఆ నిర్మాత మరియు కథానాయకుడి అయిన (ఇద్దరు ఒక్కటే) అతనికి పనితనం దక్కేనా?

కొన్ని సినిమాలు ట్రైలర్, పాటలు ఇంకా చెప్పాలి అంటే సినిమా విడుదలకి ముందు ఏదైతే ప్రేక్షకుడికి మనం భావన కలిగిస్తున్నామో అది థియేటర్ నుండి సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు జనాలకి కలిగించాలి,అలా ప్రయత్నించి వెనుక అడుగులు వేసిన వారు వున్నారు, వాళ్ళ కష్టానికి కల్గిన ప్రతిఫలం కోసం సినిమా ని సూపర్ హిట్ చేసుకున్న వారు ఉన్నారు.

ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకా ఎంత కాలం మాకు తీసిన సినిమా లో నుండి కథని అటు తిప్పి ఇటు తిప్పి, చివరికి సినిమా అయిపోయాక ముందు క్లైమాక్స్ కి ఒక ట్విస్ట్ కానీ, విరామం కి కానీ ఒక ట్విస్ట్ పెడితే జనాలు కూర్చుంటారు అనుకుంటే అక్కడే ఆ దర్శకుడుకి మంచి పేరు ఇవ్వాలో లేక నీకు ప్రతిభ వుంది తర్వాతి సినిమా కి నిన్ను నువ్వు నిరూపించుకో, లేదా నీకు సినిమా లు తియ్యడం రాదూ ఇంటికి వెళ్లు నాయన అని జనాలు ఆ దర్శకుడి జీవితాన్ని నిర్ధేషిస్తారు .

ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాం అంటే ఒక హిట్ అయ్యే సినిమా కధ రాసుకొని, దానికి అయోమయమైన సినిమా నేటివిటీ కావలి, జనాలు ఇలా అయితేనే చూస్తారు అని దర్శకుడు ఇంకా తప్పు మీద తప్పు చేస్తాడో అలాంటిదే  “మార్షల్ ” సినిమా, కథ లో చాలా ఇంపార్టెంట్ కానీ, కథనం లో కానీ చాలా మేటర్ వుంది కానీ ముందు చేప్పినట్టుగా  సినిమా నేటివిటీ కావలి అని చెడగోడితే ఫలితం కూడా సగానికి సగం సగటు సినిమా రివ్యూ ఇచ్చినట్లే ఇస్తారు.

ప్రయత్నం మంచిదే కానీ దానికి ఆ ఫలితానికి తగ్గ మూల్యం కానీ పేరు కానీ జనాల దగ్గర్నుండి ఆ దర్శకుడు ఒక్కడు మాత్రమే ఆ పని చేయగలడు. మరి ఇంతకీ సినిమా ఎలా ఉందొ, ఆ దర్శకుడి ప్రతిభ ఎలా ఉందొ, నిర్మాత మరియు హీరో  ఒక్కరే అయినా ఆ మహానుభావుడికి ఫలితం దక్కిందో లేదో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం పదండి.

ఈ సినిమా కథలో పెద్దగా కథ  అనేది లేకపోయినా ఎంచుకున్న కథనం, నేపధ్యం  వల్ల చాలా  కొత్తగా వింతగా  అనిపిస్తుంది,అది కూడా సినిమా మొత్తం ఉండదు, నిజజీవితం లో సూపర్‌స్టార్  రేంజ్ లేని హీరో శ్రీకాంత్ ,ఈ సినిమాలో నిజమైన సూపర్ స్టార్ శివాజీ (శ్రీకాంత్) (ఆ పాత్ర ఒప్పుకున్నాడు అంటేనే ధైర్యం అని చెప్పాలి) అలాంటి  హీరో కి, అభయ్(అభయ్ అడక) చాలా పెద్ద అభిమాని. చేసేది మెడికల్ కంపెనీ లో సేల్స్ డిపార్ట్మెంట్ , తనకి ఒక అక్క(శరణ్య ప్రదీప్) అంటే అమితమైన ప్రాణం.

ఇక్కడే సినిమా నేటివిటీ ఉండాలి కాబట్టి ఆమెకి గర్భసంచి గురించి పిల్లలు పుట్టరు  అని ఒక టాపిక్ ని అతికించారు, ఇంకా అక్కడి నుండి ఏం చేస్తారు ఆమె, ఆమె భర్త కలిసి కోయల్ (ఎలాగు హీరో అక్కడ ఉంటాడు) హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ చికిత్స అందుబాటులో వుంటుంది అక్కడ అడ్మిట్ అవ్వాలి కాబట్టి సింపుల్ గా అడ్మిట్  అవుతారు. మళ్ళీ ఇంకొక అపాయం జరగాలి కాబట్టి అక్కని కోమాలోకి పంపించాలి, అనుకోవడం ఎంత సేపు అతికించడం ఎంత సేపు అదే పనిగా అక్క కోమ లోకి వెళ్ళిపోతుంది.ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల సహన్నాన్ని నిర్దేషించడానికి మాత్రమే రాస్కున్న సన్నివేశాలు ఇవన్నీ.

మనం సినిమా రివ్యూ చదువుతున్నపుడే చాలా క్లూస్ మనకి అర్ధం అయిపోతాయి అలాంటిది ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు కూడా అదే భావన కలుగుతుంది అనడంలో ఎలాంటి ఆశ్యర్యం లేదు. ఇంకా కథానాయకుడి కి కూడా అక్క ఎందుకు కోమలోకి పోయింది, తను సేల్స్ టైం లో పని చేసేటప్పుడు తను కొంతమందికి ఇచ్చిన బ్యూటీ పిల్ల్స్ వేస్కొని ఇద్దరు చనిపోతారు, కొంతమంది కి ఆ పిల్ల్స్ వేస్కోవడం వల్ల వాళ్ళ హెల్త్ కి ఆ పిల్ల్స్ కారణం అని కథనాయకుడికి అర్ధం అవ్వడం, వాటికి కారణం ఒక శాస్రవేత్త కారణం అని తెలుసుకుంటాడు, తెలుసుకొని కథానాయకుడి గ ఎలా ఊరుకుంటాడు, ఊరుకోడు కదా అదే సినిమా నేటివిటీ కాబట్టి హీరో దాన్ని ఎలా చేదించాడో అనేదే కథ. అలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

సినిమా మొదలైన వెంటనే మంచి పాత్ర చివరికి ప్రతికూలంగా మారడం గత 20 సంవత్సరాల నుండి మనం చూడడం జరుగుతునేవుంది, ఇంకా అది చూపియ్యడంలో ఆ పాత్ర ని తీర్చిదిద్దడంలోనే దర్శకుడు ప్రతిభ కనపడుతుంది.ఆ విషయం లో మన దర్శకుడు విఫలం అయ్యాడు అని మనం చెప్పొచు.

మొదటి సగం ఏంటి అని చూపియ్యడం,కథానాయకుడు పరిచయ గీతం,కథానాయకి తో కూడా గీతం అలాంటివి మనకి మొదటి సగం లోనే చూస్తాం, విరామం కి ముందు ట్విస్ట్.ఇంకా రెండవ సగం లో అయిన మనకి అంత కూర్చొని చూడగలిగే అంత సినిమా ఉంది అంటే అది మన సహనాన్ని వాళ్ళు తనికి చేస్తున్నారు అని చేప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర కొత్త వాడైన “అభయ్ అడక” చేసే అంతలో బాగా చేసిన నిజమైన కథానాయకుడు మాత్రం మన శ్రీకాంత్ గారే, ఎందుకంటె మొదట చూపియ్యడం పాజిటివ్ క్యారెక్టర్ టర్నింగ్ నెగటివ్ క్యారెక్టర్ మల్లి చివరికి ఆ పాత్రని చంపేసి మరల పాజిటివ్ గా మార్చుతారు. రెండవ సగం లోనే మొత్తం చూపించాలి కాబట్టి ఆ చూపియ్యడంలోనే కాస్త విభిన్నంగా చుపించిన సగటు ప్రేక్షకుల వోట్లు పడేవి.

ఈ సినిమాలో చాల మేటర్ ఉంది అని జనాలని బాగా ఉస్తాహ పరిచారు కాని, జనాలు బయటికి వచ్చి సినిమా రివ్యూ ఎలా చెప్తారు అనే వాటిని గాలికి వోదిలేసారు.

ఇక నటీనటుల పరంగా చెప్పాలి అంటే ఎంత తక్కువ చెప్తే అంతే మంచిది. చాలా పెద్ద పెద్ద సినిమా కథలో కథానాయికకి చిన్న చిన్న పాత్రలు  రాయడం, కేవలం వీడియో సాంగ్స్ కి వరకే పరిమితం అన్నట్లు గా మనం చాలా సినిమాలో చూసేసి ఉంటాము. ఇక కథానాయకి పాత్ర గురించి ఆమె యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం మాకు, మీకు రివ్యూ లో చూడాల్సిన అవసరం కూడా తక్కువే.

ప్రయోగాల విషయం లో చాలా మంది పెద్ద పెద్ద కథానాయకులు పోటి పడి మరి వాళ్ళ యాక్టింగ్ను నిరూపించుకుంటారు కాని మన తెలుగు సినిమా లో కథ పరంగా చాలా కేర్ తీస్కోవాలి లేదంటే ఫలితం గురించి ఆ దేవుడికే వొదిలెయ్యాలి.ఈ మార్షల్ సినిమా కూడా అలాంటి దేవుడికి వొదిలెయ్యాల్సిన ఫలితం లాంటి సినిమా.

కాని హీరో శ్రీకాంత్ గురించి కాని, మన కొత్త హీరో మరియు నిర్మాత ఒకడైన అభయ్ అడక గురించి అయిన ఒకసారి చూడాల్సిన సినిమా. కానీ ఫలితం అనేది మాత్రం ఆ దేవుడికి మరియు మన ప్రేక్షకులకి ఇవ్వాల్సిన జడ్జిమేంట్.