కోలీవుడ్ లో మొదలైన కొత్త ట్రెండ్

Martial arts trend in kollywood
Martial arts trend in kollywood

ప్రపంచంలో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. కానీ సినిమా కథ మరియ తీసే విధానం బట్టి కూని జోనర్స్ గా డివైడ్ చేసారు. ముఖ్యంగా ఎవరు ఎలాంటి సినిమా తీసినా కొన్ని యూనివర్సల్ పాయింట్స్ ని మాత్రం అందరూ పాటిస్తూ ఉంటారు. సినిమా చూసే ప్రేక్షకుల టేస్ట్ ని బట్టీ, ఒక సినిమా సక్సెస్ అయితే కొంచెం దానికి దగ్గరగా ఉన్న కథలతో మరికొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కొన్ని సినిమాలు అయితే వర్షాకాలంలో వరుసగా వర్షాలు వచ్చినట్లు వస్తాయి. గత 2019 లో మాన్ తెలుగులో ఎక్కువగా థ్రిల్లర్ కథలు హిట్ అయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

ఇప్పుడు తమిళంలో వరుసగా స్పోర్ట్స్ & మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. కావాలని ప్లాన్ చెయ్యకపోయినా అవి అలా కుదిరాయి అంతే అనుకోవాలి. ఇటీవలే ధనుష్ హీరోగా “పట్టాస్” అనే సినిమా తమిళనాడు ప్రాచీన పోరాటవిద్య అయిన ఆడిమురై నేపధ్యంలో వచ్చి ఘనవిజయం సాధించింది. ఇక ఇప్పుడు అమలా పాల్ కొత్త సినిమా అయిన “అదో అంద అరవై పోలా” అనే సినిమా కూడా “గ్రామిక” అనే ఆత్మరక్షణ విద్య నేపధ్యంలో రూపొందుతోంది. ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ఇప్పటికే అమలాపాల్ ఎంతో శ్రద్ధగా ఈ విద్య నేర్చుకుంది. ఇక దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా వస్తోన్న “మాస్టర్” సినిమా పర్కలర్ అనే ఆత్మరక్షణ, పోరాట విద్య బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహన్. ఆమెకు కూడా ఫైట్ సీన్లు ఉండటంతో మాళవిక ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉంది. ప్రజలు మర్మ కళ, కళరియపట్టు, ఉరుమి లాంటి పురాతన మార్షల్ ఆర్ట్స్ బెసేడ్ మూవీస్ ని కూడా బాగా ఆదరించారు.