బ్రాండ్ బాబు కోసం మారుతి , ఈటీవి ప్రభాకర్


maruthi etv prabhakar next movie brand babuకొంతకాలం క్రితం మారుతి బ్రాండ్ బాగానే పనిచేసింది ఎందుకంటే పలు చిన్న చిత్రాలకు మారుతి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు . అయితే అందులో ఒకటి అరా మాత్రమే హిట్ అయ్యాయి మిగతావన్నీ ప్లాప్ అయ్యాయి . దాంతో మారుతి బ్రాండ్ పడిపోయింది . కట్ చేస్తే ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా ” శైలజా రెడ్డి అల్లుడు ” సినిమా చేస్తున్నాడు . అత్తా – అల్లుడు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలకు అప్పట్లో బ్రహ్మాండమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే కాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ అత్తా – అల్లుడు నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు మారుతి . ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని ప్రకటించాడు .

ఇంతకీ తాజాగా మారుతి ప్రకటించిన కొత్త సినిమా ఏదో తెలుసా …….. ”బ్రాండ్ బాబు ”. సుమంత్ శైలేంద్ర – ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీశర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు . బ్రాండ్ బాబు పేరుతో సెటైరికల్ చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట . శైలజా రెడ్డి అల్లుడు చిత్రం హిట్ అయితే బ్రాండ్ బాబు మీద అంచనాలు భారీగానే ఉంటాయి లేదంటే కొంచెం డౌటే !

అయితే ఈ సినిమా విశేషం ఏంటంటే బ్రాండ్ బాబు చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది మారుతి కాదు ఈటీవి ప్రభాకర్ . బుల్లితెర నటుడిగా , దర్శకుడిగా సంచలనం సృష్టించిన ఈ టీవీ ప్రభాకర్ వెండితెర పై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు . నెక్స్ట్ నువ్వే చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటాడు అయితే కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేదు దాంతో ఈసారి కమర్షియల్ హిట్ కొట్టాలన్న కసితో బ్రాండ్ బాబు అంటూ మారుతి తో కలిసి వస్తున్నాడు .