డైరెక్ట‌ర్ మారుతి హీరోయిన్ పెళ్లైపోయింది!

Maruthi heroine anandhi gets married
Maruthi heroine anandhi gets married

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మారుతి రూపొందించిన `బ‌స్ స్టాప్‌` మూవీతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఆనంది. తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్‌కు చెందిన ఆనంది గురువారం త‌న బాయ్‌ఫ్రెండ్‌, బిజినెస్‌మెన్ సోక్ర‌టీస్‌ని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు  మాత్ర‌మే పాల్గొన్నారు.

ఆనంది వివాహం ఆమె స్వ‌స్థ‌ల‌మైన వ‌రంగ‌ల్‌లో జ‌రిగింది. ఈ విష‌యంపై మీడియాకు కూడా ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో ఆల‌స్యంగా ఆనంది పెళ్లి విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మారుతి రూపొందించిన `బ‌స్ స్టాప్‌`తో టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ఆనంది ఆ త‌రువాత వ‌రుణ్ సందేశ్‌తో `ప్రియ‌త‌మా నీ వ‌చ‌ట కుశ‌ల‌మా` చిత్రంలో న‌టించింది. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు ల‌భించ‌క‌పోవ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయింది.

`జెర్సీ` చిత్రంతో హీరో నానికి త‌న‌యుడిగా న‌టించిన హ‌రీష్ క‌ల్యాణ్ నటించిన `పోరియాల‌న్‌` సినిమాతో త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత ప్ర‌భు సాల్మ‌న్ చేసిన `కాయ‌‌ల్` సినిమాతో అక్క‌డ మ‌రింత‌గా పాపుల‌ర్ అయింది. టాలీవుడ్‌ని వ‌దిలేసి అక్క‌డే సెటిలైన ఆనంది మ‌ళ్లీ కొంత విరామం త‌రువాత `జాంబిరెడ్డి` సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.