మారుతి డైరెక్ష‌న్‌లో మాస్ మ‌హారాజా?Maruthi next film with mas maha raja raviteja
Maruthi next film with mas maha raja raviteja

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రీసెంట్‌గా `ప్ర‌తీరోజు పండ‌గే` వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించి రెట్టించిన ఉత్సాహంతో వున్నారు యువ ద‌ర్శ‌కుడు మారుతి. ఈ హిట్ చిత్రం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నారాయ‌న‌. అయితే అది ఎవ‌రితో వుంటుంది?  రామ్‌తోనా, లేక నానితోనా అని సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఆ చ‌ర్చ‌కు తెర‌దించుతూ మారుతి త‌న కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది.

మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇటీవ‌లే మారుతి హీరో ర‌వితేజ‌కు క‌థ వినిపించార‌ని, కాన్సెప్ట్ కొత్త‌గా వుండ‌టంతో వెంనే ఓకే చేశార‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తారు? .. హీరోయిన్ ఎవ‌రు? ఎప్పుడు మొద‌ల‌వుతుంది? వ‌ంటి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే మారుతి ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.

ర‌వితేజ ప్ర‌స్తుతం `క్రాక్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. త్వ‌ర‌లోనే బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నారు.