మారుతి నెక్స్ట్ సినిమా గురించి భయపడాల్సిందేనా?


మారుతి నెక్స్ట్ సినిమా గురించి భయపడాల్సిందేనా?
మారుతి నెక్స్ట్ సినిమా గురించి భయపడాల్సిందేనా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు సముచిత స్థానం ఇస్తారు అందరూ. సెంటిమెంట్ లేకుండా ఏ సినిమా కూడా ముందుకెళ్ళదు. సినిమా ముహూర్తం పెట్టడం దగ్గరనుండి విడుదలయ్యేంత వరకూ కూడా ప్రతీదీ సెంటిమెంట్ ఆధారంగానే నడుస్తుంది. సినిమా మేకింగ్ లో సెంటిమెంట్ గురించి పక్కనపెడితే హీరోలు, దర్శకులు, నిర్మాతలకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వినడానికి వింతగా అనిపించినా వాళ్ళ పాటర్న్ చూస్తే ఆ సెంటిమెంట్స్ ను నమ్మక తప్పదు మరి. మహేష్ కు మూడక్షరాల సెంటిమెంట్, రాఘవేంద్ర రావుకి సినిమా మేకింగ్ లో ఉండగా గెడ్డం గీయకపోవడం సెంటిమెంట్, కోడి రామకృష్ణకు తలకు గుడ్డకట్టు సెంటిమెంట్. ఇలా ప్రతి ఒక్కరికీ వారి వారి సెంటిమెంట్స్ ఉన్నాయి. టాలీవుడ్ లో దర్శకుల వరకూ సెకండ్ సినిమా ఫెయిల్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది.

అలాగే రీసెంట్ గా ప్రతిరోజూ పండగేతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతికి ఒక సెంటిమెంట్ ఉంది. అది భలే భలే మగాడివోయ్ నుండి కంటిన్యూ అవుతూ వస్తోంది. అదే హిట్ తర్వాత ప్లాప్ తర్వాత హిట్ సెంటిమెంట్. అప్పటి దాకా డబల్ మీనింగ్ డైలాగులతో సినిమాలు తీస్తాడన్న పేరున్న మారుతి, భలే భలే మగాడివోయ్ చిత్రంతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించాడు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వెంకటేష్ తో బాబు బంగారం అనే సినిమా తీస్తే అది అనుకున్నంత ఆడలేదు. అయితే మళ్ళీ మారుతి ప్లాప్ ఇచ్చిన కసితో శర్వానంద్ తో మహానుభావుడు అనే చిత్రం తీసాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది.

దాని తర్వాత అక్కినేని నాగ చైతన్యతో శైలజారెడ్డి అల్లుడు అనే సినిమా తీస్తే అది మాత్రం తుస్సుమంది. ఇప్పుడేమో సాయి ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే హిట్ అయింది. అందరి అంచనాలను దాటుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బయ్యర్లందరికీ లాభాలు పంచుతోంది. ఈ నేపథ్యంలో మారుతి తర్వాతి సినిమా విషయంలోనే ఈ సెంటిమెంట్ ను నమ్మే వాళ్ళు కంగారు పడుతున్నారు. హిట్ వచ్చిన ప్లాప్, అది వచ్చిన తర్వాత హిట్ ఇవ్వడం మారుతికి అలవాటుగా మారిన నేపథ్యంలో ప్రతిరోజూ పండగే హిట్ అయింది. దీంతో ఇప్పుడు చేయబోయే సినిమా విషయంలో అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.