ఏక్ మినీ కథ హీరోతో మారుతి చిత్రం

ఏక్ మినీ కథ హీరోతో మారుతి చిత్రం
ఏక్ మినీ కథ హీరోతో మారుతి చిత్రం

సంతోష్ శోభన్ హీరోగా ముందు చాలానే ప్రయత్నాలు చేసాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు కానీ హీరోగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ సంతోష్ కెరీర్ ను మార్చేసింది. ఆసక్తికర ఆఫర్లు సంతోష్ శోభన్ వద్దకు వస్తున్నాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం సంతోష్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ను రాసుకున్నాడు. దీన్ని చాలా తక్కువ సమయంలో షూటింగ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. హీరోగా సంతోష్ శోభన్, హీరోయిన్ గా మెహ్రీన్ ను ఫిక్స్ చేసాడు.

ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది. తెలంగాణలో మధ్యాహ్నం 1 గంట వరకూ షూటింగ్ చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని 30 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు మారుతి. మెహ్రీన్ పెళ్లి వాయిదా పడడంతో కొత్త చిత్రాలను ఒప్పుకుంటోంది.

మారుతి ఇప్పటికే గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రాన్ని షూటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే.