మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు


మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు
sai dharam tej and maruthi

చిత్రలహరి చిత్రంతో విజయం సాధించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా మారుతి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . ఆరు పరాజయాలతో సతమతం అయిన సాయిధరమ్ తేజ్ కు చిత్రలహరి ఆక్సీజన్ ని అందించింది . దాంతో ఆ ఉత్సాహంతో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . ఇక మారుతి కూడా సాయి ధరమ్ తేజ్ ని విభిన్నంగా చూపించే ప్రయత్నం చేసున్నాడట .

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి . భలే భలే మగాడివోయ్ , మహానుభావుడు చిత్రాలతో జోరు మీదున్న మారుతి కి బాబు బంగారం , శైలజారెడ్డి అల్లుడు బ్రేక్ వేసాయి దాంతో మళ్ళీ కసిగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మారుతి . మెగా కుటుంబం అంటే అమితంగా ఇష్టపడే మారుతి సాయిధరమ్ తేజ్ కు సాలిడ్ హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నాడట .