ఇస్మార్ట్ హీరోతో మారుతీ కొత్త సినిమా!


Maruthi to direct hero Ram
Maruthi to direct hero Ram

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో రామ్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. మాస్ క్యారెక్ట‌ర్లో రామ్ న‌టించిన ఈ చిత్రం  మాస్‌ని ఎట్రాక్ట్ చేసింది బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌రువాత ప్ర‌తీ చిత్రాన్ని చాలా ప్లాన్డ్‌గా చేయాల‌ని రామ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వెళుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న`రెడ్` చిత్రంలో న‌టిస్తున్నారు రామ్‌. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

తమిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్ప ఈ మూవీ టీజ‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ త‌రువాత ఇంత వ‌ర‌కు రామ్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం రామ్ ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు మారుతి.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌కి `ప్ర‌తిరోజు పండ‌గే` వంటి హిట్ చిత్రాన్ని అందించిన మారుతి త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. వినోదం, ఫ్యామిలీ సెంట‌మెంట్ ప్ర‌ధానంగా ఓ క‌థ‌ని మారుతి సిద్ధం చేశార‌ని, దాన్ని ఇటీవ‌లే హీరో రామ్‌కు వినిపించార‌ని, క‌థ‌, అందులోని పాత్ర న‌చ్చ‌డంతో మారుతితో సినిమా చేయ‌డానికి రామ్ అంగీక‌రించాడ‌ని తాజా స‌మాచారం. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తార‌న్న‌ది మాత్రం తెలియాల్సి వుంది.