విజయ్ తో మారుతి సినిమా.. వర్కౌట్ అవుతుందా?

విజయ్ తో మారుతి సినిమా.. వర్కౌట్ అవుతుందా?
విజయ్ తో మారుతి సినిమా.. వర్కౌట్ అవుతుందా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డల్ ఫేజ్ ను ఎదుర్కొంటున్నాడు. నోటా నుండి మొదలుపెట్టి విజయ్ నటించిన సినిమాలు అన్నీ ప్లాపులుగానే మిగిలాయి. నోటా డబ్బింగ్ సినిమా అని సర్దిచెప్పుకున్నా ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ కేటగిరీలోకే వెళ్తుంది. కంటెంట్ విషయంలో రిపీటెడ్ అనిపిస్తున్నాడని విజయ్ మీద మెయిన్ కంప్లైంట్ నమోదైంది. దాంతో కొంత రియలైజ్ అయ్యి ఇకపై లవ్ స్టోరీలు చేయనని చెప్పాడు.

ఇక వరస ప్లాపుల కారణంగా విజయ్ కెరీర్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇదివరకటిలా దర్శకులు విజయ్ దగ్గర క్యూ కట్టట్లేదు. అయితే విజయ్ కున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ సినిమాల రిలీజ్ ల ముందు రౌడీ ఫ్యాన్స్ అంతా ఇంతా ఉండదు. అందుకే విజయ్ తన మార్కెట్ పట్టుని కోల్పోకుండా ఉండాలంటే కచ్చితంగా ఇప్పుడు వరస హిట్స్ ఇవ్వాలి. మీడియం స్లాట్ లో టాప్ రేంజ్ కు చేరుకున్న విజయ్ ఇప్పుడు దాన్ని చేజార్చుకోవాలనుకోవట్లేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో తెరకెక్కే సినిమాను చేయనున్నాడు. తనకు డౌట్ ఉన్న సినిమాల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న విజయ్ తో ఇప్పుడు ఒక హిట్ దర్శకుడు పనిచేయాలని అనుకుంటున్నాడు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మారుతి ఇంకా తన నెక్స్ట్ సినిమా ఏదీ కన్ఫర్మ్ చేసుకోలేదు. విజయ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతి కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ – మారుతి కాంబినేషన్ అంటే అది కచ్చితంగా కొత్తగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మారుతి కథకు విజయ్ ఎస్ చెబుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.