మారుతి – నాని మూవీ కన్ఫర్మ్.. కానీ!


మారుతి - నాని మూవీ కన్ఫర్మ్.. కానీ!
మారుతి – నాని మూవీ కన్ఫర్మ్.. కానీ!

బ్లాక్ బస్టర్ కాంబోకి ఉండే రెస్పాన్స్, క్రేజ్ కానీ వేరే లెవెల్ లో ఉంటాయి. ఒక హీరో, దర్శకుడు కలిసి ఒక సినిమాను సూపర్ హిట్ చేస్తే ఆ కాంబినేషన్ లో వచ్చే తర్వాత సినిమాకు బిజినెస్ పరంగా అటెంషన్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మారుతి, నాని కాంబినేషన్ లో వచ్చిన ఎంటర్టైనర్ భలే భలే మగాడివోయ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కెరీర్స్ లోనూ టాప్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అంతే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఈ చిత్రం ఎన్నో రెట్ల లాభాల్ని తీసుకొచ్చింది.

భలే భలే మగాడివోయ్ కాంబోను ఇప్పుడు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాని, మారుతి మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరినీ కలిపే పనిని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు పెట్టుకున్నాడు. ఎలాగైనా వీరితో సినిమా నిర్మించాలని ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయనే చెప్పాలి. ఇటీవలే మీడియాతో ముచ్చటిస్తూ ఈ కాంబోలో సినిమా త్వరలో తెరకెక్కనుందని ప్రకటించాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. నాని V సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నాడు. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని లేట్ సమ్మర్ కు విడుదల చేయాలని భావిస్తున్నారు. టక్ జగదీష్ తర్వాత నాని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకిత్ర్యాన్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడు. ఆ రెండు సినిమాలు పూర్తయితే కానీ నాని మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి ఈ ఏడాది పూర్తైపోతుంది. మరోవైపు మారుతి కూడా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కొడుకును ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను నెత్తిన పెట్టుకున్నాడు. ఈ చిత్రం మొదలవ్వడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతి, నాని కాంబో ఎప్పటికి వర్కౌట్ అవుతుందో చూడాలి.