పండగ దర్శకుడితో ఇస్మార్ హీరో సినిమా?


maruti keen to work with ram for his next
maruti keen to work with ram for his next

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరస ప్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ డూపర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ కావడంతో రామ్ కు మళ్ళీ మార్కెట్ బలపడింది. దీంతో దర్శకులు రామ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ప్రతిరోజూ పండగే దర్శకుడు మారుతి, రామ్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి కూడా ప్లాపుల నుండి బయటపడి ప్రతిరోజూ పండగే సినిమాతో మంచి హిట్ సాధించాడు. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలే వచ్చినా కానీ ప్రేక్షకుల మెప్పు మాత్రం పొందింది. ఈ చిత్రానికి మొదటిరోజు నుండే కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి. వీక్ డేస్ లో కూడా ప్రతిరోజూ పండగే డౌన్ అవ్వట్లేదు. ఇప్పటికే 75 శాతం కలెక్షన్స్ తిరిగిరాబట్టిన ఈ చిత్రం ట్రెండ్స్ బట్టి చూస్తుంటే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకునే అవకాశముంది. మొత్తానికి మారుతి ప్రతిరోజూ పండగే చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లో పడ్డట్లే.

ఈ చిత్రం తర్వాత ఇప్పుడు మారుతి డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేయాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమా తర్వాత మారుతి, రామ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రామ్ ఇమేజ్ కు తగ్గట్లుగా యాక్షన్ అంశాలతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ కూడా రెడ్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తమిళంలో హిట్ అయిన తడం సినిమాకు రీమేక్ ఈ చిత్రం. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఏప్రిల్ 2న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఒరిజినల్ లో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. మణిశర్మ రెడ్ కు సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మతో మళ్ళీ కలిసి పనిచేస్తున్నాడు రామ్.

ఇక రామ్-మారుతి సినిమా గురించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశముంది.