మాస్ విజయం కోసం పరితపిస్తున్న “మాస్ రాజా”


Disco Raja
మాస్ విజయం కోసం పరితపిస్తున్న “మాస్-రాజా”

పేరుకి నిజంగానే మాస్ రాజా, అతని ఎనర్జీ కి పేరు పెట్టలేం. అతనే మాస్ మహారాజ “రవితేజ”.

నిజానికి 2000-2011 వరకి అతనికి సంవత్సరానికి ఒక నిజమైన హిట్ మూవీ వుంది అంటే అతిశయోక్తి కాదు.

కానీ ఎప్పుడు ఒకరిధి రాజ్యం అయితే బాగుండదు అని దేవుడు దీవించాడో ఏమో కానీ,2012 నుండి 2018 వరకి రవితేజ మాత్రం సినిమాలు చేస్కుంటూ వెల్లిపోతున్నాడు, అందులో ఒక్క “రాజా – ధి గ్రేట్” సినిమా తప్ప మిగిలినవి ఏమి అంతగా ఆశీంచినంత విజయం మన మాస్ రాజా కి ఎదురవ్వలేదు. మాస్ రాజ్ ఫాన్స్ కూడా ఒక హిట్ అని సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతూ మన మాస్ రాజా ని వేడుకుంటున్నారు.

అయితే 2019 జనవరి లో మొదలు పెట్టిన తన 66 వ సినిమా “డిస్కో రాజా” ఫస్ట్ లుక్ పోస్టర్ గత 2 రోజుల నుండి సోషల్ మీడియా లో చాలా బాగా పాపులర్ అవుతుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది చివరి నెల అనగా “డిసెంబర్-2019-20” తేదీన రిలీస్ కి రెఢీ అవుతుంది.

అయితే ఈ సినిమా తనకి నిజమైన విజయం తెస్తుంది అని రవితేజ గారు చాలా confident గా వున్నారు అని ఫిల్మ్ నగర్ నుండి బాగా వినిపిస్తున్నది.

ఈ సినిమా కి దర్శకుడుగా “ఎక్కడికీ పోతావు చిన్నవాడా” మరియు “ఒక్క క్షణం” లాంటి వైవిధ్యమైన దర్శకుడిగా పేరు పొందిన “విఐ –ఆనంద్” దర్శకత్వ బాధ్యత చేపట్టారు.