డిస్కో రాజా అనుమానాలన్నీ చవితితో క్లియర్


Ravi Teja
Ravi Teja

మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా విశేషాన్ని ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ వినాయక్ చవితి స్పెషల్ గా విడుదల చేయనున్నారు. ఈ మధ్య రవితేజ లుక్ అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసాయి.

ప్రముఖ మీడియా సంస్థలు కూడా వాటిని నిజమే అనుకుని పబ్లిష్ చేసేశాయి. అయితే తీరిగ్గా నిర్మాణ సంస్థ ఆ లుక్ అఫీషియల్ కాదని త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించాయి. సో, వినాయక చవితి రోజున రవితేజ లుక్ కు సంబంధించిన సస్పెన్స్ తొలగిపోనుంది. పాయల్ రాజ్ పుత్, తాన్యా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.