విజ‌య్ పుట్టిన రోజున `మాస్ట‌ర్‌` వ‌చ్చేస్తున్నాడు?

విజ‌య్ పుట్టిన రోజున `మాస్ట‌ర్‌` వ‌చ్చేస్తున్నాడు?
విజ‌య్ పుట్టిన రోజున `మాస్ట‌ర్‌` వ‌చ్చేస్తున్నాడు?

దేశాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టి పీడిస్తోంది. దీని కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇడ్డందులోకి వెళుతోంది. ఎక్క‌డివి అక్క‌డే నిలిచిపోయాయి. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఒక్క‌సారిగా స్థంభించిపోయాయి. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. దీంతో మ‌రో 19 రోజుల పాటు మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ని విధించారు. దీంతో అత్య‌ధికంగా ప్ర‌భావితం అవుతున్న రంగం సినీమా రంగం.

స‌మ్మ‌ర్‌లో సీజ‌న్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. మే కూడా పోతే సినిమా ఇండ‌స్ట్రీకి న‌ష్టం భారీ స్థాయిలో వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే త‌న చిత్రాన్ని మాత్రం ఆరు నూరైనా త‌న చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేయ‌డం ఖాయం అని చెప్పేస్తున్నాడు తమిళ హీరో విజ‌య్‌.

విజ‌య్ హీరోగా న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `మాస్ట‌ర్`. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం జూన్ 22న విడుద‌ల చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ రోజు హీరో విజ‌య్ పుట్టిన రోజు అందుకే `మాస్ట‌ర్‌` చిత్రాన్ని ఆరోజు  ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఏప్రిల్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ రిలీజ్ వాయిదాప‌డింది.