`మాస్ట‌ర్‌` నిర్మాత‌ల షాకింగ్ నిర్ణ‌యం!

`మాస్ట‌ర్‌` నిర్మాత‌ల షాకింగ్ నిర్ణ‌యం!
`మాస్ట‌ర్‌` నిర్మాత‌ల షాకింగ్ నిర్ణ‌యం!

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `మాస్ట‌ర్‌`. లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ నెల 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన విష‌యం తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.

థియేట‌ర్ల‌లో సంక్రాంతికి సంద‌డి చేసిన ఈ చిత్రం రెండు వారాలు తిర‌క్కుండానే ఓటీటీలో విడుద‌ల‌వుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఈ చిత్రాన్ని త‌మ ఓటీటీలో విడుద‌ల చేస్తోంది.

ఈ నెల 29న `మాస్ట‌ర్‌` తెలుగు, త‌మిళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు రిలీజ్ డేట్ ట్రైల‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు. ర‌వితేజ న‌టించిన  `క్రాక్‌` చిత్రాన్ని ఇదే తేదీని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు ఆహా వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అయితే ర‌వితేజ రిక్వెస్ట్ చేయ‌డంతో ఫిబ్ర‌వ‌రి 5కు రిలీజ్ డేట్‌ని మార్చాయి. అదే త‌ర‌హాలో `మాస్ట‌ర్‌` రిలీజ్ డేట్ కూడా మారుతుందా? అన్న‌ది అనుమాన‌మే.