విజయ్ నిర్మాతలు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారువిజయ్ నిర్మాతలు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు
విజయ్ నిర్మాతలు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మాస్టర్. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే పూర్తయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ప్రభావం కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో మాస్టర్ ను ఓటిటిలో విడుదల చేస్తారన్న టాక్ మొదలైంది. ఇప్పటికే ఓటిటి సంస్థలతో డీల్స్ పూర్తయ్యాయని, మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ లో కలకలం మొదలైంది.

మాస్టర్ ను థియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదల చేస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పేసారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో మాస్టర్ నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమకు ఒక పెద్ద ఓటిటి సంస్థ నుండి ఆఫర్ వచ్చినా కాదనుకున్నామని, కచ్చితంగా మాస్టర్ థియేటర్లలోనే విడుదలవుతుందని, దానికి మీ సహకారం కావాలని వారు క్లారిటీ ఇచ్చారు.

లోకేష్ కానగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు.