ఎం బి ఎం (మేరా భారత్ మహాన్) రివ్యూ


mbm mera bharat mahan review
mbm mera bharat mahan review

ఎం బి ఎం (మేరా భారత్ మహాన్) రివ్యూ
నటీనటులు : అఖిల్ కార్తీక్ , ప్రియాంక శర్మ , డాక్టర్ శ్రీధర్ రాజు
సంగీతం : లలిత్ సురేష్
నిర్మాతలు : డాక్టర్ శ్రీధర్ రాజు , డాక్టర్ తాళ్ల రవి , డాక్టర్ పల్లవి రెడ్డి
దర్శకత్వం : భరత్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 26 ఏప్రిల్ 2019

వైద్య వృత్తిలో ఉన్న ముగ్గురు డాక్టర్లు సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన సందేశాత్మక చిత్రం ” ఎం బి ఎం ” మేరా భారత్ మహాన్ . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? చూద్దామా ?

సమాజంలో వేళ్ళూనుకుపోయిన కార్పోరేట్ వ్యవస్థలతో సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి స్వస్తిక్ ఆపరేషన్ మొదలు పెడతాడు మహాన్ ( డాక్టర్ శ్రీధర్ రాజు ) . తన ఆపరేషన్ కు కార్తీక్ , సంజిత గ్యాంగ్ ని ఎంచుకుంటాడు శ్రీధర్ రాజు . సామాజిక చైతన్యం కలిగిన కార్తీక్ – సంజిత లు మహాన్ కు ఎలా సహకరించారు . అసలు ఈ మహాన్ ఎవరు ? ఎందుకు స్వస్తిక్ ఆపరేషన్ మొదలు పెట్టాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
కథ
శ్రీధర్ రాజు క్యారెక్టర్
2 పాటలు

నటీనటుల ప్రతిభ :
మహాన్ పాత్రలో డాక్టర్ శ్రీధర్ రాజు అద్భుతంగా రాణించాడు . విప్లవ భావాలున్న వ్యక్తిగా సమ సమాజం కోసం పాటుపడే శక్తిగా , కార్పొరేట్ వ్యవస్థపై ఉక్కు పిడికిలి బిగించే పాత్రలో శ్రీధర్ రాజు మెప్పించాడు . ప్రియాంక శర్మ తన పాత్ర మేరకు నటించింది అలాగే గ్లామర్ తో కూడా అలరించింది . అఖిల్ కార్తీక్ కు మంచి పాత్ర లభించింది దాంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు . ఇక మిగిలిన పాత్రల్లో తనికెళ్ళ భరణి , నారాయణరావు , అపూర్వ , బాలాజీ , గిరిబాబు , బాబూమోహన్ , ఆమని , వినోద్ , దాసన్న , ఎల్బీ శ్రీరామ్ , సుమన్ శెట్టి , తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :
డాక్టర్ శ్రీధర్ రాజు మంచి కథ ని అందించాడు , దర్శకుడు భరత్ ఆ కథ ని తన శక్తి మేరకు బాగానే చూపించాడు . అయితే స్క్రీన్ ప్లే లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది . మొత్తానికి రగులుతున్న సమస్య ని టచ్ చేసి మంచి ప్రయత్నం చేసారు . ఇక నిర్మాతల విషయానికి వస్తే …… మొదటి సినిమానే అయినప్పటికీ ఎక్కడా రాజీపడకుండా ఎం బి ఎం ని నిర్మించారు . అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికీ కార్పోరేట్ వ్యవస్థ వల్ల జరుగుతున్న అనర్దాలను చాటి చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ సినిమాని లాభాపేక్ష లేకుండా నిర్మించినందుకు తప్పకుండా వాళ్ళని అభినందించి తీరాల్సిందే . లలిత్ సురేష్ అందించిన పాటల్లో 2 ఆకట్టుకునేలా ఉన్నాయి .

ఓవరాల్ గా :
మంచి సందేశాత్మక చిత్రం ” ఎం బి ఎం ” మేరా భారత్ మహాన్