మీటూ ఎఫెక్ట్ : నటుడిపై లైంగిక వేధింపులు


 Police case against actor vinayakan
Police case against actor vinayakan

 

మీటూ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది , తాజాగా ప్రముఖ మలయాళ నటుడు వినాయగన్ పై కేసు నమోదు అయ్యింది . ప్రముఖ సామాజిక కార్యకర్త మృదులాదేవి వినాయగన్ పై కేసు పెట్టింది . ఓ కార్యక్రమం కోసం వినాయగన్ కోసం ఫోన్ చేస్తే తన కోరిక తీర్చాలని అసభ్య పదజాలంతో మాట్లాడాడని , అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే నా తల్లి కూడా అతడి కోరిక తీర్చాలని కోరడం అందుకే పశువులాంటి ఈ నటుడిపై చర్యలు తీసుకోండి అంటూ వాయనాడ్ జిల్లా లోని కాల్ పెట్టా పోలీసులను ఆశ్రయించింది .

అంతేకాదు అందుకు సంబందించిన ఆడియో టేప్ ని కూడా పోలీసులకు అందజేసింది మృదులాదేవి . అయితే ఈమె ఆరోపణలు వాస్తవం కాదని అంటున్నారు వినాయగన్ ని అభిమానించేవాళ్ళు . వినాయగన్ తెలుగు , తమిళ , మలయాళ బాషలలో నటించాడు .