మనకి నవంబర్ 01 వ తేదినా మొత్తం తెలుస్తుంది ఏమి చెప్తారో?…..


మనకి నవంబర్ 01 వ తేదినా మొత్తం తెలుస్తుంది ఏమి చెప్తారో?.....
మనకి నవంబర్ 01 వ తేదినా మొత్తం తెలుస్తుంది ఏమి చెప్తారో?…

మన టాలీవుడ్ లో కొత్తదనం మంచి ఊపు మీద ఉంది. మన తెలుగు సినిమాలు మంచి కొత్త కథలని, కొత్త కథానాయకులని, నాయికలని, దర్శకులని పరిచయం చేస్తుంది. అది అంత సులభం కాదు. వాళ్ళు యాక్టింగ్ లో, దర్శకత్వంలో, సైడ్ ఆర్టిస్ట్ లుగా మంచి అనుభవం గల శిక్షణతో అడుగులు వేస్తున్నారు.

పెళ్లి చూపులు సినిమా దగ్గర నుండి బ్రోచేవారెవరురా సినిమా వరకు అంత కొత్త దర్శకులు, కథానాయికలు, సైడ్ ఆర్టిస్ట్ లు చాలా మంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంతమందికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. అందులో ‘తరుణ్ భాస్కర్’ మరియు ‘అభినవ్ గౌతమ్’. ఒకలు దర్శకులు, ఇంకొకలు సైడ్ ఆర్టిస్ట్. ఇలా వాళ్లిదరు మొదటి సినిమా దగ్గరనుండి ప్రతి సినిమాకి చాలా మంచి నైపుణ్యంతో కలిసి పని చేసారు మిగిలిన సినిమాలకి కూడా.

అయితే ‘విజయ్ సాయి దేవరకొండ‘ తండ్రి గారు తమ కొడుకుల పేరుతో నిర్మాణ సంస్థని రూపొందించారు. వారు ”తరుణ్ భాస్కర్” ని హీరోగా పరిచయం చేస్తూ సినిమాని నిర్మిస్తున్నారు, సినిమా పేరు ”మీకు మాత్రమే చెప్తా” అని టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. టీజర్ చూడటానికి చాలా బాగుంది. సినిమా అక్టోబర్ 18 న విడుదల అని ప్రచారం కూడా చేసారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 01 వ తేదీన విడుదల అవుతుంది అని డేట్ ని మార్చారు. కారణము అయితే తెలవదు కానీ సినిమా మీద జనాలకి బాగా ఆసక్తి పెరిగింది.
సినిమాలో ఇంకా అనసూయ భరద్వాజ్, అభినవ్ గౌతమ్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతిక మిశ్ర నటీనటులు ఉన్నారు. దర్శకుడిగా ‘షమ్మీర్ సుల్తాన్’ భాద్యతలు చేపట్టారు. మరి దర్శకుడి నుండి హీరోగా మారుతున్న తరుణ్ భాస్కర్ హిట్ కొడతాడా అంటే నవంబర్ ఒకటవ తారీఖున మన అందరికి తెలుస్తుంది ఏమి చెప్తారో అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు.