కేటీఆర్ కి స్పెషల్ షో సెట్ చేసిన విజయ్


Vijay Deverakonda and KTR
Vijay Deverakonda and KTR

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సొంత బ్యానర్ నుంచి డిఫరెంట్ ఫిల్మ్ వస్తుండడంతో టాలీవుడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. ఆడియెన్స్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక నవంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను అందరికంటే ముందే తెలంగాణ ఐటి మినిష్టర్ కేటీఆర్ వీక్షించనున్నారట. హైదరాబాద్ AMB సినిమాస్ లో విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా స్పెషల్ షోని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సపోర్ట్ తో సినిమాకు ప్రమోషన్స్ డోస్ పెంచిన రౌడి స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేశాడు.
ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా సినిమాపై లుక్కేస్తుండడంతో జనాల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం పక్కా. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్రలో నటించింది. మరి విజయ్ బ్యానర్ లో విడుదలవుతున్న మొదటి స్పెషల్ మూవీ మీకు మాత్రమే చెప్తా ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.