సుశాంత్ ది ముమ్మాటికీ హ‌త్యేనా?Meenakshi mishra sensational comments on Sushant singh
Meenakshi mishra sensational comments on Sushant singh

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆరోజు నుంచి ఇప్ప‌టి వ‌రకు సుశాంత్ మృతిపై రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వ‌స్తోంది. సుశాంత్ తండ్రి కె.కె. సింగ్ ఇటీవ‌ల రియాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో సుశాంత్ మృతి కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా సుశాంత్‌ది ఆత్మ హ‌త్య కాదు హ‌త్యే అంటూ ర‌క్ష‌ణ శాఖ ఆర్డినెన్స్ ఆసుప‌త్రిలో ప‌నిచేసే ప్ర‌ముఖ డెర్మ‌టాల‌జిస్ట్ మీనాక్షీ మిశ్రా ఓ సంచ‌ల‌న వీడియోని విడుద‌ల చేసింది.

ఇప్పుడిది సంచ‌ల‌నంగా మారింది. ఈ వీడియోలోని కొన్ని గుర్తుల్ని, సుశాంత్ బాడీపై వున్న గాయాల‌ని  ప్ర‌త్యేకంగా చూపిస్తూ ఆమె సుశాంత్ ది ముమ్మాటికీ హ‌త్యే అంటూ తేల్చేశారు. మీనాక్షీ మిశ్రా రిలీజ్ చేసిన వీడియోలో సుశాంత్ ముఖంపై, ఇత‌ర ప్రదేశాల్లో గాయాలున్నాయ‌ని, అత‌న్ని కొట్టి చంపార‌ని, ఆ త‌రువాత దాన్ని ఆత్మ హ‌త్య‌గా చిత్రీక‌రించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇటీవ‌ల బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కూడా సుశాంత్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అత‌నిది ఆత్మ హ‌త్య కాద‌ని, హ‌త్యేన‌ని ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. దీనిపై కూడా దుమారం మొద‌లైంది. తాజాగా ఈయ‌న వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ ర‌క్ష‌ణ శాఖ ఆర్డినెన్స్ ఆసుప‌త్రిలో ప‌నిచేసే ప్ర‌ముఖ డెర్మ‌టాల‌జిస్ట్ మీనాక్షీ మిశ్రా విడుద‌ల చేసిన వీడియోలోనూ ప‌లు అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.