ఎన్టీఆర్ స్టార్ హీరో ఎలా అయ్యాడు – మీరాచోప్రా


ఎన్టీఆర్ స్టార్ హీరో ఎలా అయ్యాడు - మీరాచోప్రా
ఎన్టీఆర్ స్టార్ హీరో ఎలా అయ్యాడు – మీరాచోప్రా

మీరాచోప్రా – ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య అగ్లీవార్ చిలికి చిలికి పెను దుమారంగా మార‌బోతోంది. ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `బంగారం` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది మీరా చోప్రా. ఆ త‌రువాత నితిన్ `మారో`, వాన వంటి చిత్రాల్లో న‌టించింది. ఆ త‌రువాత తెలుగు తెర‌కు దూర‌మైంది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార‌ణంగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది.

ఇటీవ‌ల అభిమానుల‌తో ఇన్‌స్టా లైవ్‌లో మా‌ట్లాడిన మీరాని ఎన్టీఆర్ ఫ్యాన్ మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్ట‌మ‌ని అడిగితే త‌న‌కు మ‌హేష్‌బాబు అంటే ఇష్ట‌మ‌ని చెప్పింద‌ట‌. అయితే మ‌రి ఎన్టీఆర్ అంటే త‌నెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డంతో మీరా చోప్రాకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా అగ్లీ వార్ మొద‌లైంది. రాత్రికి నీ రేటెంత‌ని, నువ్వు పోర్న్ స్టార్‌ల వుంటావ‌ని అస‌భ్య ప‌ద‌జాలంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరాని ఆడుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై హైద‌రాబాద్ సిటీ పోలీస్‌తో పాటు సైబ‌రాబాద్ క్రైమ్ పోలీస్‌ల‌ని సంప్ర‌దించింది మీరా చోప్రా. ఇదిలా వుంటే ఈ వుదంతం నేప‌థ్యంలో మీరా చోప్రా ఓ మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా స్టార్ హీరో ఎన్టీఆర్‌పై, ఆయ‌న ఫ్యాన్స్‌పై విరుచుకుప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. ప‌బ్లిక్‌గా త‌న అభిమానులు ఓ మ‌హిళ‌ని గ్యాంగ్ రేప్ చేస్తామ‌ని, మ‌ర్డ‌ర్ చేస్తామ‌ని, చెప్ప‌లేని భాష‌లో బూతులు తిడుతున్నా ఎన్టీఆర్ మాత్రం స్పందించ‌డం లేదు. ఇదేనా స్టార్‌డ‌మ్ అంటే?. త‌న అభిమానుల‌నే కంట్రోల్ చేసుకోలేని ఎన్టీఆర్ ఎలా స్టార్ హ‌రో అయ్యాడని మీరా చోప్రా మండిప‌డింది.