మీరా మిథున్ కు బెయిల్ మంజూరు


Meera Mithun
Meera Mithun

వివాదాస్పద తమిళ నటి మీరా మిథున్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది . ఇంతకీ మీరా మిథున్ పై ఉన్న కేసు ఏంటి ? ఆమెకు బెయిల్ ఎందుకు అనుకుంటున్నారా ? ఓ పూల వ్యాపారి ని మోసం చేసి 50 వేల రూపాయలు తీసుకుంది . పూల వ్యాపారికి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడంతో కేసు పెట్టాడు ఆ వ్యాపారి .

అయితే ఇదే సమయంలో మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ 3 లో పాల్గొంది . ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే బిగ్ బాస్ 3 కి ఇబ్బంది కాబట్టి ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకుంది . దాంతో మీరా మిథున్ కు బెయిల్ మంజూరు చేయడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మీరా అంతేనా బిగ్ బాస్ టీమ్ కూడా . అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాకా విచారణకు సహకరిస్తానని తెలపడంతో ప్రస్తుతానికైతే మీరా మిథున్ కథ సుఖాంతం అయ్యింది .