బంధుప్రీతిపై నాగాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

mega brothee Nagababu fires on Nepotism
mega brothee Nagababu fires on Nepotism

సినీ ఇండ‌స్ట్రీలో బంధుప్రీతి (నెపోటిజ‌మ్) ఎక్కువే అని, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి ఇక్క‌డ అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌నే మాట‌లు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు `మ‌న చాన‌ల్ మ‌న‌ ఇష్టం` చాన‌ల్ ద్వారా ఘాటుగా స్పందించారు. ఇండ‌స్ట్రీలో బంధుప్రీతి మ‌రీ ఎక్కువైందిని ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వింటున్నాం. మ‌రీ ముఖ్యంగా నాలుగు ఫ్యామిలీలు అనే మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది. అది జ‌ల‌స్‌, అక్క‌సు, చేత‌గాని త‌నం, కుళ్లు.. ఇలాంటివి లోప‌ల వున్న వాళ్లు మాత్ర‌మే అలాంటి మాట‌లు మాట్లాడుతార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక్క‌డ టాలెంట్ వున్న వారే నిల‌బ‌డ‌తారు. ద‌మ్ముంటేనే హీరో అవుతారు. అంతే కానీ టాలెంట్ లేకుండా జ‌నాల‌మీద రుద్దితే హీరో కాలేరు. ముందుగా మా కుటుంబం గురించి చెప్పాలంటే 20 ఏళ్ల వ‌య‌సులో చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌కు ఎలాంటి గాడ్ ఫాద‌ర్ లేరు. ఎంతో క‌ష్ట‌ప‌డి మెగాహీరో అయ్యాడు. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నారు.

ఇక త‌రువాతి త‌రంలో వ‌చ్చిన బ‌న్నీ ఎంతో శ్ర‌మించి త‌న‌ని తాను ప్రూవ్ చేసుకుని హీరో అయ్యాడు. చ‌ర‌ణ్ కూడా బాంబే వెళ్లి యాక్టింగ్ నేర్చుకుని సినిమాల్లోకి రావ‌డానికి హార్డ్ వ‌ర్క్ చేశాడు. అంతే కానీ చిరంజీవి కొడుకు అని మాత్ర‌మే గుర్తింపు తెచ్చుకోలేదు. చ‌ర‌ణ్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. అత‌ని సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌, నిహారిక సినిమా కోసం శ్ర‌మిస్తార‌ని, సాయి ధ‌ర‌మ్‌తేజ్‌కు వ‌రుస‌గా ఐదు ఫ్లాప్‌లు ఎదురైతే ఎంత‌గా బాధ‌ప‌డ్డాడో నాకు తెలుస‌ని, మ‌రి బంధు ప్ర‌తితో హిట్లు సాధింగ‌ల‌మా? అని ప్ర‌శ్నించారు. నాలుగు కుటుంబాల‌కు చెందిన హీరోల గురించి, వారు ప‌డిన క‌ష్టం గురించి ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.