మెగా బ్ర‌ద‌ర్ షాకింగ్ లుక్ వైర‌ల్‌!

Mega brother new getup shocked everyone
Mega brother new getup shocked everyone

మెగా సోదరుడు నాగా బాబు ఎప్పుడూ తన సోషల్ మీడియా పోస్టులతో వార్త‌ల్లో నిలుస్తుంటారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటారు. గ‌త‌ కాలంగా తను తన లుక్ ని మార్చుకోవ‌డం కోసం చాలా శ్ర‌మిస్తున్నారు. తదనుగుణంగా కొన్ని రోజుల క్రితం ఆయ‌న‌ పూర్తిగా పెరిగిన గడ్డంతో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

దీనికి కొంత క్లాస్ ట‌చ్ ఇచ్చే మ‌రో గెట‌ప్‌తో ఫొటోల‌కు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా నాగా బాబు క్లీన్ షేవ్ పిక్చర్ పోస్ట్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. `అర‌వింద స‌మేత‌`లో జ‌గ‌ప‌తి బాబు పోషించిన పాత్ర త‌ర‌హాలో మేక‌ప్ చేసుకుని ముఖం మీద మచ్చలు, గాటుతో సిగరెట్ తాగుతూ నాగ‌బాబు భయంకరంగా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

`మనిషి తన వేషధారణలో అబద్ధం చెప్పడు. నిజం ఏమిటంటే మీరు అతనిని మీ స్వేచ్ఛతో ఎంతవరకు విస్తరించారో అంటూ నాగ‌బాబు పెట్టిన పోస్ట్  వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ నాగాబాబు ఈ గెట‌ప్‌లో ఎందుకు ఫొటోల‌కు పోజులిచ్చారు? .. ఏదైనా సినిమా కోస‌మా? ల‌ఏక సీరియ‌ల్ కోస‌మా?  లేక త‌ను ఈ త‌ర‌హా పాత్ర‌ల్లోనూ న‌టించ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవ‌డం కోస‌మేనా? అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది.