మెగా బ్రదర్స్ కు షాక్ ఇచ్చిన ప్రజలు


మెగా బ్రదర్స్ నాగబాబు , పవన్ కళ్యాణ్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసాడు . భీమవరం , గాజువాకలో , అయితే ఈ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ దారుణమైన ఓటమి చవిచూశాడు . భీమవరం లో కాస్త మెరుగు ఎందుకంటే అక్కడ రెండో స్థానంలో నిలిచాడు కానీ గాజువాకలో మాత్రం మూడో సస్థానానికి పరిమితమయ్యాడు పవన్ కళ్యాణ్ .

ఇక నాగబాబు నర్సాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసాడు . జనసేన ప్రభంజనం వీస్తుంది అని ధీమా వ్యక్తం చేసాడు కట్ చేస్తే ఊసులో లేకుండాపోయాడు . ప్రజాసేవ చేస్తామంటూ వచ్చిన మెగా బ్రదర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ ఇచ్చిన తీరుకి ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు . మెగా బ్రదర్స్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ ఇవ్వడం ఇది రెండోసారి . ఇంతకుముందు 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం అంటూ వస్తే తిప్పి నేలకేసి కొట్టారు . మళ్ళీ 2019 లో పవన్ కళ్యాణ్ ని కోలుకోకుండా చేసారు .